61కి పెరిగిన ముంబై భవన మృతులు | Mumbai building collapse toll 61 | Sakshi
Sakshi News home page

61కి పెరిగిన ముంబై భవన మృతులు

Sep 29 2013 9:05 AM | Updated on Sep 1 2017 11:10 PM

మాజ్‌గావ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 61కు చేరుకుంది.

ముంబై: మాజ్‌గావ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 61కు చేరుకుంది. ఘటనా స్థలం నుంచి మరో ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. దాదాపు 48 గంటల పాటు చేపట్టిన నిర్విరామ సహాయ కార్యక్రమాలను ప్రతికూల వాతావరణం కారణంగా ఈ తెల్లవారుజామున నిలిపివేశారు. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశముందని భావిస్తున్నారు.

దాదాపు 50 ఏళ్ల క్రితం కట్టిన ఈ భవనం శుక్రవారం ఉదయం కుప్పకూలిన విషయం తెలిసిందే,  దుర్ఘటన జరిగే సమయానికి అందులో ఉండేవాళ్లంతా గాఢనిద్రలో ఉండటం వల్లే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భవనంలో నివసిస్తున్న సకాల్ మరాఠీ దినపత్రిక జర్నలిస్ట్ యోగేశ్ పవార్, అతడి తంఢ్రి అనంత్ పవార్ కూడా మరణించారని బీఎంసీ విపత్తు నియంత్రణ అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో 31 మంది గాయపడ్డారని అధికారులు శనివారం సాయంత్రం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement