అమ్మ మాట విని ఓ ఉగ్రవాది.. | Mother appeals, militant son surrenders in J&K | Sakshi
Sakshi News home page

అమ్మ మాట విని ఓ ఉగ్రవాది..

Nov 4 2016 5:44 PM | Updated on Sep 4 2017 7:11 PM

అమ్మ మాట విని ఓ ఉగ్రవాది..

అమ్మ మాట విని ఓ ఉగ్రవాది..

ఉగ్రవాదిగా మారిన కొడుకు.. తల్లి కోరిక మేరకు భద్రత దళాలకు లొంగిపోయాడు.

శ్రీనగర్: ఉగ్రవాదిగా మారిన కొడుకు.. తల్లి కోరిక మేరకు భద్రత దళాలకు లొంగిపోయాడు. కశ్మీర్లో ఈ భావోద్వేగ సంఘటన జరిగింది.

గురువారం రాత్రి సొపోర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాది ఉన్నాడని ఇంటలిజెన్స్ వర్గాలు సమాచారం ఇవ్వడంతో సైన్యం.. ఇతర భద్రత దళాలతో కలసి ఆ ఇంటిని చుట్టుముట్టింది. ఆ ఇంట్లో ఉన్న ఉగ్రవాది ఉత్తర కశ్మీర్లోని ఉజ్జర్కు చెందిన ఉమర్ ఖలిక్ మిర్ అలియాస్ సమీర్ అని అధికారులకు తెలిసింది. అతని ఇల్లు అక్కడికి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అధికారులు వెంటనే అతని కుటుంబ సభ్యులను కలసి మిర్ లొంగపోయేందుకు సహకరించాల్సిందిగా కోరారు. అతనికి హాని తలపెట్టబోమని హామీ ఇచ్చారు.

దీంతో మిర్ తల్లి అధికారులతో కలసి అతను తలదాచుకున్న ఇంటి దగ్గరకు వచ్చింది. లోపలకు వెళ్లి భద్రత అధికారులకు లొంగిపోవాల్సందిగా కుమారుడికి నచ్చజెప్పింది. తల్లి కోరిక మేరకు మిర్ అధికారుల ఎదుట లొంగిపోయాడు. ఏకే రైఫిల్, మూడు మేగజైన్లు, మూడు గ్రెనేడ్లు, ఓ రేడియో సెట్ను స్వాధీనం చేశాడు. 26 ఏళ్ల మిర్ గత మేలో పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో చేరాడు.
 

Advertisement

పోల్

Advertisement