breaking news
Lashker-e-Taiba militant
-
నన్ను భారత్ ఆర్మీ కాపాడింది
-
నన్ను భారత్ ఆర్మీ కాపాడింది : ఉగ్రవాది
కశ్మీర్ : నన్ను ఇండియన్ ఆర్మీ కాపాడింది.. ఈ మాట చెప్పింది ఓ కరుడు కట్టిన ఉగ్రవాది. బారాముల్లాలో భారత సైనికులతో పాటు, ప్రజలపై దాడులకు పాల్పడుతూ పట్టుబడిన నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరు. ఓ వీడియో విడుదల చేస్తూ.. హింసను విడనాడాలంటూ తనతోటి స్నేహితులు, మిలిటెంట్లకు విజ్ఞప్తి చేస్తున్నాడు. తన పేరు అజీజ్ అహ్మద్ గోజ్రీ అని చెప్పిన అతడు, తన స్నేహితులు సుహైన్ అభూబ్, మొహసీన్ ముస్తాక్ భట్, నాసిర్ అమిన్ డ్రాజీలను ఉగ్రవాదం విడిచి తమ స్వస్థలాలకు రావాలంటూ కోరాడు.. ఇళ్లను, తల్లిదండ్రులను విడిచి, తప్పుడు మార్గంలో వెళ్తూ.. అడవుల్లో జీవించే తర స్నేహితులు ఇంటికి రావాలంటూ కోరాడు. ఆర్మీ అధికారులు తనను అరెస్టు చేసినప్పుడు, చంపే అవకాశం ఉన్నా, చంపకుండా జీవితాన్ని కాపాడారని వెల్లడించాడు. అంతకు ముందు రోజే పాకిస్తాన్ తనతో భారత భద్రతా బలగాలు చాలా క్రూరమైనవని అంటూ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిందని, కానీ అది వాస్తవం కాదన్నాడు. భారత ఆర్మీ అధికారులను కలిస్తే అసలు విషయం బోధపడుతుందన్నాడు. ఇదంతా పాకిస్తాన్ చేసే కుట్రని పేర్కొన్నాడు. పాకిస్తాన్, లష్కరే తోయిబా కాశ్మీరీ యువత జీవితాలతో ఆడుకుంటోందని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఏప్రిల్ 30న ఉత్తర కశ్మీర్లో భారత భద్రతా బలగాలు 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. వారిలో నలుగురు ఉగ్రవాదులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారి స్వయం ప్రకాశ్ మాట్లాడుతూ లష్కరే తోయిబా కు చెందిన ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని చెప్పడానికి తమ దగ్గర చాలా సాక్షాలు ఉన్నాయని తెలిపారు. మిగిలిన వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని అన్నారు. -
చీలిన లష్కరే తోయిబా; జైషే మన్కాఫా ఏర్పాటు
-
అమ్మ మాట విని ఓ ఉగ్రవాది..
శ్రీనగర్: ఉగ్రవాదిగా మారిన కొడుకు.. తల్లి కోరిక మేరకు భద్రత దళాలకు లొంగిపోయాడు. కశ్మీర్లో ఈ భావోద్వేగ సంఘటన జరిగింది. గురువారం రాత్రి సొపోర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాది ఉన్నాడని ఇంటలిజెన్స్ వర్గాలు సమాచారం ఇవ్వడంతో సైన్యం.. ఇతర భద్రత దళాలతో కలసి ఆ ఇంటిని చుట్టుముట్టింది. ఆ ఇంట్లో ఉన్న ఉగ్రవాది ఉత్తర కశ్మీర్‌లోని ఉజ్జర్కు చెందిన ఉమర్ ఖలిక్ మిర్ అలియాస్ సమీర్ అని అధికారులకు తెలిసింది. అతని ఇల్లు అక్కడికి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అధికారులు వెంటనే అతని కుటుంబ సభ్యులను కలసి మిర్ లొంగపోయేందుకు సహకరించాల్సిందిగా కోరారు. అతనికి హాని తలపెట్టబోమని హామీ ఇచ్చారు. దీంతో మిర్ తల్లి అధికారులతో కలసి అతను తలదాచుకున్న ఇంటి దగ్గరకు వచ్చింది. లోపలకు వెళ్లి భద్రత అధికారులకు లొంగిపోవాల్సందిగా కుమారుడికి నచ్చజెప్పింది. తల్లి కోరిక మేరకు మిర్ అధికారుల ఎదుట లొంగిపోయాడు. ఏకే రైఫిల్, మూడు మేగజైన్లు, మూడు గ్రెనేడ్లు, ఓ రేడియో సెట్‌ను స్వాధీనం చేశాడు. 26 ఏళ్ల మిర్ గత మేలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో చేరాడు.