టీటీడీ బోర్డు సభ్యునిగా ఎమ్మెల్యే చింతల | mla chintala ramachandra reddy appointed as ttd board member | Sakshi
Sakshi News home page

టీటీడీ బోర్డు సభ్యునిగా ఎమ్మెల్యే చింతల

Apr 11 2015 3:31 PM | Updated on Aug 25 2018 7:16 PM

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నియమితులయ్యారు.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తిరుమల శ్రీవారికి పరమ భక్తుడైన చింతలకు టీటీడీ బోర్డు సభ్యత్వం రావడంతో ఆయన అనుచరులు కూడా హర్షం వ్యక్తం చేశారు.

అయితే.. ఇంకా టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరన్న విషయం మాత్రం ఖరారు కాలేదు. దీని కోసం టీడీపీ వర్గాల్లోనే పోటీ తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో కనుమూరి బాపిరాజు రెండుసార్లు బోర్డు చైర్మన్ పదవిని నిర్వర్తించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇంకా ఎవరినీ చైర్మన్గా నియమించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement