మీడియాకు చిక్కిన మహేష్ షా డైరీ

మీడియాకు చిక్కిన మహేష్ షా డైరీ - Sakshi

కమీషన్ల కోసం కక్కుర్తి పడి కటకటాల పాలైన అహ్మదాబాద్ వ్యాపారి మహేష్‌ షా డైరీ మీడియాకు చిక్కింది. ఈ డైరీలో ఐడీఎస్ స్కీమ్ కింద మహేష్ షా ప్రకటించిన ఆస్తులు గుజరాత్, మహారాష్ట్ర వ్యాపారులకు చెందినవిగా గుర్తించారు. ఒక శాతం లంచం ఇస్తామనడంతో రూ.13,860 కోట్ల బ్లాక్మనీని కేంద్రప్రభుత్వం ఆదాయ డిక్లరేషన్ పథకం కింద తనదిగా మహేష్ షా ప్రకటించాడు. అయితే ఆ బడాబాబులు చివరి నిమిషంలో చేతులెత్తేయడంతో రూల్స్ ప్రకారం కట్టాల్సిన 45 శాతం పన్నులో తొలి వాయిదా రూ. 1,560 కోట్లను చెల్లించలేక పారిపోయాడు. దీంతో షాపై అనుమానంతో ఐటీ అధికారులు అతని వెతుకులాట ప్రారంభించారు.

 

ఇటీవలే అతన్ని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఐటీ అధికారుల విచారణలో ఆ నగదు అతనిది కాదని గుర్తించారు. ఐడీసీ కింద బయటపెట్టిన బ్లాక్మనీ అంతా తనది కాదని, అది కొందరు రాజకీయనేతలు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలది షా ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అది ఎవరిదో కూడా త్వరలోనే బయటపెడతానని షా పేర్కొన్నాడు. ఈ పరిణామాల అనంతరం షా డైరీ మీడియాకు కంట పడింది. 

 

 

 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top