మారుతి వెటారా బ్రెజా పెట్రోల్ వెర్షన్ త్వరలో
దేశంలో అతిపెద్ద కార్ మేకర్ మారుతి సుజికి తమన సక్సెస్ ఫుల్ కారు విటారా బ్రెజా పెట్రోల్ వెర్షన్ ను కూడా త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. 2017లో దీన్ని మార్కెట్ లో లాంచ్ చేయనుంది
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ మేకర్ మారుతి సుజికి తమన సక్సెస్ ఫుల్ కారు విటారా బ్రెజా పెట్రోల్ వెర్షన్ ను కూడా త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. 2017లో దీన్ని మార్కెట్ లో లాంచ్ చేయనుంది. పెట్రోల్ ధరలు తగ్గడం, ఇటీవల పరిణామాల నేపథ్యంలో పెట్రోల్ ఇంజీన్ బ్రెజ్జాను రిలీజ్ చేసేందుకు యోచిస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ముఖ్యంగా తగ్గిన పెట్రోల్ ధరలు, ఇంధన ధరలు నుండి ఉపశమనం, ఎక్కువ మంది ప్రజలు ఇప్పుడు పెట్రోల్ తో నడిచే వాహనాల వైపే మొగ్గు చూపడం కారణాలుగా భావిస్తున్నాయి. దీనికి తోడు డీజిల్ వాహనాలకు వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కఠినమైన వైఖరి మూలంగా మారుతి తన హ్యాచ్ బ్యాక్ మోడళ్లను పెట్రోల్ వెర్షన్ లో కూడా తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోందని పేర్కొంటున్నారు.
డీజిల్ ఇంజీన్ కాంపాక్ట్ ఎస్యూవీ విటారా బ్రెజా వినియోగదారుల హృదయాలను గెలుచుకున్నప్పటికీ మరింతమంది యూజర్లను ఆకట్టుకునేలా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిలో ఎబీఎస్ అండ్ డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. అంతేకాకుండా దీనిలో టచ్ స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ, ఆపిల్ కార్ప్లే, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, బహుళ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ తదితర ఫీచర్లు ఈ పెట్రోల్ వెర్షన్ లో కూడా లభించనున్నాయి. పెట్రోల్ ఇంజీన్ తో విటారా బ్రెజా లాంచ్ అయితే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ , టియువి300 తో గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.