ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు.
సనత్‌నగర్ (హైదరాబాద్): ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. ఈ ఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎల్లారెడ్డిగూడ నివాసి డి.మల్లేశ్ (48) కొంత కాలం దుబాయిలో పనిచేసి వచ్చాడు.
అప్పులు పెరిగిపోవడంతో మంగళవారం అర్ధరాత్రి తన ఇంట్లోనే యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతడ్ని గాంధీ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.