
ఆయనను చంపాలని కోరుకుంటున్నారా?
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు.
డైమండ్ హార్బర్: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలు పొరపాటే కాదని, ముమ్మాటికీ తప్పు అని అన్నారు. ఆయనపై తగిన చర్య తీసుకుంటామని తెలిపారు. తపస్ పాల్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు ఆయనను చంపేయాలా అంటూ మమత ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగించింది.
"తపస్ పాల్ వ్యాఖ్యలు పారపాటు. పెద్ద తప్పు. ఆయనపై ఏమేం చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. ఇది ఒక వ్యక్తి చేసిన తప్పు. దీనికి ఆయనను నేను చంపాలని కోరుకుంటున్నారా. ఏం చేయాలో అది చేస్తాం. దీనికి ఒక విధానమంటూ ఉంది' అని విలేకరులతో మమతా బెనర్జీ అన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని తపస్ పాల్ ను మమత ఆదేశించారు.