కుప్పకూలిన మలేషియా విమానం: 295 మంది మృతి

కుప్పకూలిన మలేషియా విమానం: 295 మంది మృతి


మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం ఒకటి ఉక్రెయిన్లో కుప్పకూలింది. అమెరికాలోని ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్తున్న ఈ విమానం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్లో ఉండగా కుప్పకూలింది. ఈ విమానంలో 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్లంతా మరణించినట్లు మలేషియా హోం శాఖ నిర్ధారించింది. ఎంహెచ్-17 విమానంతో సంబంధాలు తెగిపోయాయని, ఆ తర్వాత అది కూలిపోయినట్లు తెలిసిందని, మొత్తం అందులో ఉన్నవారంతా మరణించారని మలేషియన్ ఎయిర్ లైన్స్ సంస్థ కూడా తెలిపింది. గురువారం మధ్యాహ్నం 12.14 గంటలకు బయల్దేరిన ఈ విమానం శుక్రవారం ఉదయం 6.10 గంటలకు కౌలాలంపూర్ చేరుకోవాల్సి ఉంది. ఆలోపే ఈ ప్రమాదం జరగడంతో మొత్తం ప్రయాణికులు, సిబ్బంది అంతా మరణించారు.


అయితే, రష్యా మిసైల్ వల్లే ఈ విమానం కూలినట్లు ఉక్రెయిన్ హోం మంత్రి ఆన్టోన్ తెలిపారు. విమానం 10వేల మీటర్ల ఎత్తులో ఉండగా రష్యా దాన్ని మిసైల్తో కూల్చేసిందన్నారు. గత రెండు వారాల్లో తమ దేశ యుద్ధ విమానాలను కూడా రష్యా కూల్చేసిందని ఆయన వివరించారు.


ఈ బోయింగ్ 777 విమానం గంటకు 950 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. రెండు ప్రాంతాల మధ్య దూరం ఎక్కువ కాబట్టి ఈ విమానాన్ని ఉపయోగిస్తారు. ప్రమాద విషయాన్ని అందరికంటే ముందుగా రష్యా వార్తా సంస్థ ఇంటర్ఫాక్స్ బయటి ప్రపంచానికి తెలిపింది. ఆ తర్వాతే మలేషియన్ ఎయిర్ లైన్స్ కూడా నిర్ధారించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top