వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రేమ పెళ్లి | love marriage under the ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రేమ పెళ్లి

Aug 10 2015 3:45 PM | Updated on May 29 2018 2:26 PM

వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రేమ పెళ్లి జరిగింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా చింతూరులో సోమవారం చోటుచేసుకుంది.

తూర్పుగోదావరి(చింతూరు): వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రేమ పెళ్లి జరిగింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా చింతూరులో సోమవారం చోటుచేసుకుంది. చింతూరు మండలం మామిళ్లగూడెంకు చెందిన ప్రమీళ, మారేడిమిల్లి మండలానికి చెందిన శివప్రసాద్ లు హైదరాబాద్‌లో ఓ ఫ్యాక్టరీ పనిచేశారు. ఆ సమయంలో వీరు ఒకరునొకరు ప్రేమించుకున్నారు.

అయితే శివ ప్రసాద్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో ప్రమీళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు జంటకు కౌన్సెలింగ్ నిర్వహించగా ఇరువురు అంగీకరించారు. అయితే వీరి తల్లిదండ్రులకు వైఎస్సార్ సీపీ నేతలు నచ్చజెప్పి పార్టీ ఆధ్వర్యంలో పెళ్లి జరిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement