మళ్లీ లారీల సమ్మె చేస్తాం | Lorries would strike again | Sakshi
Sakshi News home page

మళ్లీ లారీల సమ్మె చేస్తాం

Sep 20 2015 3:13 AM | Updated on May 24 2018 1:57 PM

లారీల త్రైమాసిక పన్ను తగ్గింపు, రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వేచ్ఛగా తిరిగేం దుకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల జారీ

 ప్రభుత్వానికి యజమానుల సంఘం హెచ్చరిక
 
 సాక్షి, హైదరాబాద్ : లారీల త్రైమాసిక పన్ను తగ్గింపు, రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వేచ్ఛగా తిరిగేం దుకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల జారీ డిమాండ్లపై లారీ యజమానుల సంఘం ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసింది. డిమాండ్లను ఆమోదించకపోతే ఈ నెల 28 తర్వాత మళ్లీ సమ్మెకు దిగుతామని పేర్కొంది. గతంలో సమ్మె చేసినప్పుడు వాటి పరి ష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది. శనివా రం సంబంధిత విభాగాధిపతులు లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యి వాటిపై చర్చించారు. పన్ను తగ్గింపు అంశాన్ని పరిశీలించేందుకు వీలుగా ఆర్థిక శాఖకు వివరాలను అందించినట్టు రవాణాశాఖ కార్యదర్శి సునీల్‌శర్మ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా వసూలవతున్న పన్ను వివరాలను రవాణాశాఖ కమిషనర్ సుల్తానియా వివరిస్తూ ఆర్థిక శాఖకు లేఖ రాసినట్టు వెల్లడించారు. సంవత్సరానికి రూ.5 వేలతో కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇచ్చేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించినట్టు చెప్పారు. తాము అందుకు సిద్ధంగా ఉన్నందున వారు కూడా అంగీకరించాలని సూచించారు. లోడింగ్, అన్‌లోడింగ్ చార్జీలు, లారీ సిబ్బంది వద్ద వసూళ్లు చేయటంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చించారు.

ఓవర్‌లోడ్ నివారణ, ఇసుక అక్రమరవాణాకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. అనంతరం సంఘం ప్రతినిధులు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మను కలసి వినతిపత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా టోల్‌గేట్ల తొల గింపు, లారీ అద్దెలపై టీడీఎస్ రద్దు తదితర   డిమాండ్లను కూడా అందులో పేర్కొన్నారు. సమావేశంలో లారీ యజమానుల సంఘం పక్షాన భాస్కర రెడ్డి, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement