దేశంలో పశు గణం 2015 నాటికి 31.2 కోట్లకు చేరుతుందని అసోచాం వెల్లడించింది. ప్రస్తుతం పశువుల సంఖ్య 28 కోట్లుందని, ఏటా 4 శాతం వృద్ధి నమోదు చేస్తుందని తెలిపింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో పశు గణం 2015 నాటికి 31.2 కోట్లకు చేరుతుందని అసోచాం వెల్లడించింది. ప్రస్తుతం పశువుల సంఖ్య 28 కోట్లుందని, ఏటా 4 శాతం వృద్ధి నమోదు చేస్తుందని తెలిపింది. వేగంగా పెరుగుతున్న జనాభా కారణంగానే పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు తదితర ఉత్పత్తులకు డిమాండ్‌ను తెచ్చిపెడుతోందని వివరించింది. ఇంత ప్రాధాన్యత ఉన్నందున పశు, పశుగ్రాస ఉత్పాదకత, నాణ్యతను మెరుగుపరచాలని అసోచాం కార్యదర్శి డి.ఎస్.రావత్ సూచించారు.
ఆరోగ్యం, పరిశుభ్ర నిర్వహణ లేక వ్యాధులు వ్యాపించడంతో పశువుల ఉత్పాదక శక్తి సన్నగిల్లుతోందని అన్నారు. దేశంలో 60 శాతంమేర పశుదాణా కొరత ఉందని వెల్లడించారు. వ్యవసాయ పరిశోధనలు, సేవలు, సమాచారం రైతులకు ఎప్పటికప్పుడు చేరితేనే వృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. పశు సంపదలో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌ల వాటా 35 శాతం ఉంది. దేశంలోని పశుగణానికి ఏటా 70 మిలియన్ టన్నుల దాణా అవసరం.