కొత్త యూనిట్లకు రాయితీ రేటు
కేంద్రానికి అసోచామ్ సూచనలు
న్యూఢిల్లీ: పన్నుల సరళీకరణ, క్రమబద్దీకరణతోపాటు కొత్తగా ఏర్పాటు చేసే తయారీ యూనిట్లకు రాయితీ పన్ను రేటుతో కూడిన పథకాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసోచామ్ కోరింది. బడ్జెట్‌కు ముందు తమ సూచనలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవకు సమరి్పంచింది. సెక్షన్ 115బీఏబీ కింద కొత్తగా ఏర్పాటు చేసే తయారీ యూనిట్లకు రాయితీతో కూడిన 15 శాతం పన్నును తిరిగి పునరుద్ధరించాలని అసోచామ్ కోరింది. దీనివల్ల తాజా పెట్టుబడులను ఆకర్షించొచ్చని, ఇది దేశ ఆర్థిక వృద్ధికి, ఎగుమతులకు సాయం చేస్తుందని అభిప్రాయపడింది.
దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద రుణ మాఫీని ప్రతిపాదించింది. టీడీఎస్‌కు సంబంధించి అసోసియేటెడ్ ఎంటర్‌ప్రైజెస్ నిర్వచనం ఇవ్వాలని, డీమెర్జర్లు (వ్యాపారాల విభజన) వేగవంతానికి వీలుగా ట్యాక్స్ నూట్రాలిటీ వర్తింపజేయాలని కోరింది. కస్టమ్స్ విధానం కింద సమగ్రమైన పన్ను మాఫీ పథకాన్ని తీసుకురావాలని కోరింది. తద్వారా వివాదాల భారం తగ్గుతుందని అభిప్రాయపడింది. జీఎస్‌టీలోని సెక్షన్ 74ఏకు మాదిరే కస్టమ్స్ చట్టం కింద నిరీ్ణత గడువుల క్రమబదీ్ధకరణకు చర్యలు తీసుకోవాలని కోరింది. బడ్జెట్ 2025లో ప్రవేశపెట్టిన స్వచ్ఛంద వెల్లడి నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని ప్రభుత్వం దృష్టికి అసోచామ్ తీసుకెళ్లింది.


