బానిసలుగా అమ్మేస్తున్నారు! | Libya: African refugees being sold at 'regular public slave auctions' | Sakshi
Sakshi News home page

బానిసలుగా అమ్మేస్తున్నారు!

Apr 12 2017 4:05 PM | Updated on Mar 28 2019 6:23 PM

బానిసలుగా అమ్మేస్తున్నారు! - Sakshi

బానిసలుగా అమ్మేస్తున్నారు!

యూరప్‌కు వలసపోతున్న ఆఫ్రికా వాసులను స్మగ్లర్లు లిబియాలో బానిసలుగా అమ్ముతున్న విషయం వెలుగుచూసింది.

జెనీవా: యూరప్‌కు వలసపోతున్న ఆఫ్రికా వాసులను స్మగ్లర్లు లిబియాలో బానిసలుగా అమ్ముతున్న విషయం వెలుగుచూసింది. ఒక్కొక్కరిని 200 డాలర్లు(దాదాపు రూ.13వేలు) నుంచి 500 డాలర్లకు విక్రయిస్తున్నారని, కొందరిని లైంగిక అవసరాలు తీర్చే సరుకుల్లా అమ్మేస్తున్నారని బాధితుల కథనాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ వలస సంస్థ(ఐఎంఓ) తెలిపింది.

మంచి భవిష్యత్తు కోసం యూరప్‌ వెళ్లడానికి ఆఫ్రికన్‌ వాసులు మానవ అక్రమరవాణా ముఠాలకు డబ్బులు చెల్లిస్తున్నారని, అయితే వారు గమ్యానికి చేరుకోకుండా స్మగ్లర్ల చేతిలో బందీలవుతున్నారని లిబియాలోని ఐఎంఓ విభాగాధిపతి వెల్లడించారు. బందీలను స్మగ్లర్ల చెర నుంచి తప్పించుకోవడానికి బాధిత కుటుంబాలు భారీగా డబ్బులు చెల్లిస్తున్నాయన్నారు. తనతోపాటు 25 మందిని లిబియాలో నిర్బంధించారని, తొమ్మిది నెలల చిత్రహింసల తర్వాత తన తండ్రి ఇంటి అమ్మేసి తనను విడిపించాడని గాంబియా వాసి ఒకరు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement