
డేటింగ్ రూమర్స్‌పై హీరోయిన్ క్రేజీ కౌంటర్!
నా ఆప్తురాలు నుపూర్ సనన్‌తో కలిసి ప్రస్తుతం ఇంట్లో ఛాయ్ తాగుతున్నా. థాయ్‌లాండ్‌లో అచ్చం నాలాంటి వారిని ఎవరినో చూసి.. నేనేనని మీరు పొరబడి ఉంటారు..
‘నా ఆప్తురాలు నుపూర్ సనన్‌తో కలిసి ప్రస్తుతం ఇంట్లో ఛాయ్ తాగుతున్నా. థాయ్‌లాండ్‌లో అచ్చం నాలాంటి వారిని ఎవరినో చూసి.. నేనేనని మీరు పొరబడి ఉంటారు’ .. తనపై రూమర్స్ రాసిన ఓ వెబ్‌సైట్‌కి హీరోయిన్ కృతి సనన్ ఇచ్చిన కేజ్రీ సమాధానం ఇది. మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘వన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది.
త్వరలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో కలిసి ‘రాబ్తా’ సినిమాను కృతి చేయబోతున్నది. ఈ నేపథ్యంలో సుశాంత్ తో కృతి సన్నిహితంగా మెలుగుతున్నదని, ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్నదని గత కొన్నిరోజులుగా బాలీవుడ్‌లో వదంతులు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సినీ వెబ్‌సైట్.. సుశాంత్, కృతి థాయ్‌లాండ్‌లో విహరిస్తున్నారని, ‘రాబ్తా’ సినిమా కోసం థాయ్‌లాండ్‌లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ పనిలోపనిగా.. ఈ జంట కలిసి విహరిస్తున్నదని కథనం రాసింది. దీనికి కౌంటర్ ఇస్తూ.. తాను ఇంట్లోనే ఆప్తురాలితో ఛాయ్ తాగుతున్నానంటూ ఆ ఫొటోను కృతి షేర్ చేసింది.
@pinkvilla Having Chai at home with my Lovebird @NupurSanon !! Who's my look-alike holidaying in Thailand?