కుటుంబ సమేతంగా సోనియాతో కేసీఆర్ భేటీ | kcr meets sonia ganhi along with his family | Sakshi
Sakshi News home page

కుటుంబ సమేతంగా సోనియాతో కేసీఆర్ భేటీ

Feb 23 2014 12:59 PM | Updated on Oct 22 2018 9:16 PM

కుటుంబ సమేతంగా సోనియాతో కేసీఆర్ భేటీ - Sakshi

కుటుంబ సమేతంగా సోనియాతో కేసీఆర్ భేటీ

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబ సమేతంగా ఆదివారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం అయ్యారు

న్యూఢిల్లీ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబ సమేతంగా ఆదివారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. ఆయన తన 12మంది కుటుంబ సభ్యులతో కలిసి ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు కేసీఆర్ ఈ సందర్భంగా సోనియాకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. కేసీఆర్, ఆయన సతీమణి, ఆయన కుమారుడు, కోడలు, కుమార్తె కవిత, ఆమె భర్త, హరీష్ రావు, ఆయన సతీమణి, వారి పిల్లలు ఈ సమావేశంలో ఉన్నారు.

కాగా తెలంగాణ బిల్లు౮ పార్లమెంట్లో ఆమోదం పొందితే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనియాతో భేటీ సందర్భంగా విలీనం అంశం కూడా చర్చకు రావొచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే కేసీఆర్ కృతజ్ఞతలు చెప్పటానికే సోనియాను కలుస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement