మరోసారి కరీనా బిడ్డడి హల్‌చల్‌

మరోసారి కరీనా బిడ్డడి హల్‌చల్‌


న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్‌ల  ముద్దుల  కొడుకు మరోసారి వార్తల్లో నిలిచాడు. మంగోలు మహారాజు తైమూర్‌ పేరుతో సోషల్‌ మీడియాలో  హల్‌ చల్  చేసిన ఈ   బుడ్డోడి ఫోటో ఇపుడు ఇంటర్నెట్‌ లో  హాట్ టాపిక్‌.  తాజాగా కరీనా సహా, ఆమె లిటిల్‌ ఏంజెల్‌ ఫోటోను  ఓ ఫ్యాన్‌ ఇన్‌ స్టా‍గ్రాంలో  షేర్‌ చేశారు. తల్లిదండ్రుల పోలికలతో  ముద్దులొలుకుతూ అమ్మ ఒడిలో ఒదిగిపోయిన ఈ చిన్నిరాజా ఫోటో ఇపుడు స్టార్‌ ఎట్రాక్షన్‌గా మారిపోయింది.   అభిమానుల షేర్లు,  లైక్‌ లతో  నిండిపోయింది.


కాగా   కపూర్‌, సైఫ్‌ జంటకు తైమూర్ ఖాన్‌ డిసెంబర్ 20, 2016 న జన్మించాడు.  అయితే తమ చిన్నారికి తైమూర్‌ అలీఖాన్‌ పటౌడీ నవాబ్‌ అని పేరు పెట్టడం అప్పట్లో సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది.  బాబుకు ఈ పేరు ఎందుకు పెట్టారో చెప్పాలంటూ  కొందరు నెటిజన్లు డిమాండ్‌ చేయడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top