బిల్లు సవరణలపై ఛైర్మన్కు 'శీలం' నోటీసులు | Sakshi
Sakshi News home page

బిల్లు సవరణలపై ఛైర్మన్కు 'శీలం' నోటీసులు

Published Wed, Feb 19 2014 10:19 AM

జేడీ శీలం - Sakshi

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు బుధవారం రాజ్యసభకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బిల్లుపై సవరణలకు కేంద్ర సహాయ మంత్రి జేడీ శీలం రాజ్యసభ ఛైర్మన్కు నోటిసులు ఇచ్చారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చేయాలని సీమాంధ్ర నేతల నిర్ణయంపై చర్చ జరగాలన్నారు. అలాగే సీమాంధ్రలో అత్యంత వెనకబడిన ప్రాంతాలు ఉత్తరాంధ్ర, రాయలసీమలకు కేటాయించే నిధులపై స్పష్టత ఇవ్వాలని, వీటితోపాటు రాయలసీమలోని కొన్ని జిల్లాలను కలసి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని చైర్మన్కు ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు.

 

అలాగే విభజన వల్ల సీమాంధ్ర పాంత్రం తీవ్రంగా నష్ట పోతుంది. ఈ నేపథ్యంలో పన్ను రాయితీలపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఆ పన్ను రాయతీలన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు జరగాలని సూచించారు.  అయితే టి. బిల్లుపై 10 సవరణలు చేయాలని రాజ్యసభలో బీజేపీ కోరింది. సీమాంధ్రకు రూ. 10 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ కోరాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించింది.

Advertisement
Advertisement