వాచ్‌: జల్లికట్టు సంబరం మొదలు! | jallikattu begins in Karungulam village of Tamil Nadu | Sakshi
Sakshi News home page

వాచ్‌: జల్లికట్టు సంబరం మొదలు!

Jan 29 2017 11:12 AM | Updated on Sep 5 2017 2:25 AM

వాచ్‌: జల్లికట్టు సంబరం మొదలు!

వాచ్‌: జల్లికట్టు సంబరం మొదలు!

తమిళుల సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు సంబరం మళ్లీ మొదలైంది.

తమిళుల సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు సంబరం మళ్లీ మొదలైంది. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేస్తూ తమిళనాడు ప్రభుత్వం బిల్లును ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్రంలోని కరుంగులం గ్రామంలో ఆదివారం స్థానికులు జల్లికట్టు క్రీడను  ఘనంగా నిర్వహించారు. క్రీడలో భాగంగా సంప్రదాయబద్ధంగా ముస్తాబుచేసిన ఎద్దులను అదుపుచేసేందుకు యువత పోటీపడ్డారు.

'జల్లికట్టు' ప్రమాదకరమైన క్రీడ అని, దీనిని నిషేధించాలని పెటా ఉద్యమించడంతో సుప్రీంకోర్టు దీనిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, తమ సంప్రదాయమైన ‘జల్లికట్టు’ పోటీలను శాశ్వతంగా అనుమతించాలంటూ తమిళనాడు యువత పెద్ద ఎత్తున ఉద్యమించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి.. మొదట ఆర్డినెన్స్‌, ఆ వెంటనే అసెంబ్లీలో బిల్లును ఆమోదించడంతో ఈ క్రీడకు లైన్‌ క్లియర్‌ అయింది. దీంతో తమిళనాడులోని పలు గ్రామాల్లో 'జల్లికట్టు'ను ఉత్సాహంగా నిర్వహించేందుకు యువత సిద్ధమవుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement