దీపావళి ఆఫర్తో ఇంటెక్స్ కొత్త టీవీ | Intex launches new LED TV at Rs 16,490 | Sakshi
Sakshi News home page

దీపావళి ఆఫర్తో ఇంటెక్స్ కొత్త టీవీ

Oct 10 2016 4:38 PM | Updated on Sep 4 2017 4:54 PM

దీపావళి ఆఫర్తో ఇంటెక్స్ కొత్త టీవీ

దీపావళి ఆఫర్తో ఇంటెక్స్ కొత్త టీవీ

దేశీయ మొబైల్ హ్యాండ్సెట్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీ ఇంటెక్స్ టెక్నాలజీస్ సరికొత్త 32 అంగుళాల ఎల్ఈడి టీవీని సోమవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధరను రూ 16,490గా కంపెనీ ప్రకటించింది..

న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ హ్యాండ్సెట్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీ  ఇంటెక్స్  టెక్నాలజీస్  కొత్త  ఎల్ఈడి  టీవీని లాంచ్  చేసింది. తన సరికొత్త 32 అంగుళాల ఎల్ఈడి టీవీని సోమవారం  మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధరను రూ 16,490గా కంపెనీ ప్రకటించింది.

3222 మోడల్ ఎల్ఈడిటీవీలో  అన్ డ్యూ  ల్యాగ్  తొలగించి, అన్ని వైపుల నుంచి  స్మార్టీ లుకింగ్  వ్యూని అందించే  ఐ సేఫ్  టి-మ్యాట్రిక్స్ టెక్నాలజీ ని అమర్చారు.  ఇప్పటికే  వినియోగదారుల్లో మంచి ఆదరణ పొందిన తాము తమ  పోర్ట్ఫోలియోలో ఈ కొత్త శ్రేణి ఎల్ఈడి  టీవీని జోడించడానికి సంతోషిస్తున్నామని  , ఇంటెక్స్  డైరెక్టర్, బిజినెస్ హెడ్, నిధి మార్కండేయ ప్రకటించారు.  అలాగు ఈ టీవీ కొనుగోలుపై  దీపావళి ఆఫర్ గా వినియోగదారులు ఐదు సంవత్సరాల వారంటీ తో పాటు 8000ఎంఏహెచ్ పవర్ బ్యాంకు ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు.  ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు చెల్లుతుందని  నిధి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement