ఆదాయం వచ్చే వరకూ సాయం చేయాలి: సీఎం | Income Until Need help: CM | Sakshi
Sakshi News home page

ఆదాయం వచ్చే వరకూ సాయం చేయాలి: సీఎం

Aug 31 2015 1:14 AM | Updated on Mar 23 2019 9:10 PM

ఆదాయం వచ్చే వరకూ సాయం చేయాలి: సీఎం - Sakshi

ఆదాయం వచ్చే వరకూ సాయం చేయాలి: సీఎం

ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి ఆదాయం వచ్చే వరకూ రాష్ట్రానికి కేంద్రం సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు.

టీడీపీలోకి మాజీ మంత్రి డొక్కా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి ఆదాయం వచ్చే వరకూ రాష్ట్రానికి కేంద్రం సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. పొరుగు రాష్ట్రాలకు వాటి రాజధానుల నుంచి 40 శాతం పైగా ఆదాయం వస్తోందని వివరించారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఎండీ హిదాయత్‌తో సహా పలువురు ఆదివారం టీడీపీలో చేరారు.

వారికి చంద్రబాబు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను కేంద్రం అమలు చేయాల్సిందేనన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఉత్పన్నమైన సమస్యల పరిష్కారానికి అందరి సహకారం కావాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement