ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్దే విజయం: అమిత్ జోగి | I am confident of a victory in Chhattisgarh, we will get 55-60 seats says Amit Jogi | Sakshi
Sakshi News home page

ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్దే విజయం: అమిత్ జోగి

Nov 19 2013 11:06 AM | Updated on Mar 18 2019 9:02 PM

ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్దే విజయం: అమిత్ జోగి - Sakshi

ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్దే విజయం: అమిత్ జోగి

ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని కోట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్న అమిత్ జోగి ధీమా వ్యక్తం చేశారు.

ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని కోట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్న అమిత్ జోగి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ 55-60 సీట్లు కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. పదేళ్ల బీజేపీ దుష్ప్రరిపాలనకు ఛత్తీస్గఢ్ ఓటర్లు ముగింపు పలుకుతారని  కాంగ్రెస్ నేత ఛత్తీస్‌గఢ్‌ తొలి ముఖ్యమంత్రి అజిత్‌ జోగి ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా ఛత్తీస్గఢ్లో రెండు, చివరి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికలు జరుగుతున్న 72 నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు క్యూ లైన్లలో కనిపిస్తున్నారు. ఇక అజిత్‌ జోగి, అమిత్‌ జోగి, ఆయన భార్య... కోటలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement