టీపొడి విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ భర్త ఆత్మహత్యకు దారితీసింది. వనస్థలిపురం పోలీసుల కథనం ప్రకారం...
రంగారెడ్డి(తుర్కయంజాల్): టీపొడి విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ భర్త ఆత్మహత్యకు దారితీసింది. వనస్థలిపురం పోలీసుల కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్ గ్రామానికి చెందిన దేవోజి రవి(40), భార్య చందన, ఇద్దరు పిల్లలతో కలిసి బీఎన్‌రెడ్డినగర్ పరిధిలోని చైతన్యనగర్‌లో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం 10 గంటలకు టీపొడి విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
దీంతో రవి తన భార్యాపిల్లలను బయటకు పంపి గది తలుపు వేసుకున్నాడు. వారు ఎంత పిలిచినా తలుపు తీయలేదు. లోపలి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆందోళనకు గురై భార్యాబిడ్డలు ఇంటి యజమానిని, ఇరుగు పొరుగు వారిని పిలిచారు. వారు గడ్డపారతో తలుపు గడియ బద్దలుకొట్టి చూడగా రవి సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని మృతి చెంది ఉన్నాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.