ఆ టాలీవుడ్‌ బ్యూటీ పెళ్లి చేసుకోబోతున్నదా? | heroine Regina Cassandra tweet on marriage | Sakshi
Sakshi News home page

ఆ టాలీవుడ్‌ బ్యూటీ పెళ్లి చేసుకోబోతున్నదా?

Oct 19 2016 8:00 PM | Updated on Sep 4 2017 5:42 PM

ఆ టాలీవుడ్‌ బ్యూటీ పెళ్లి చేసుకోబోతున్నదా?

ఆ టాలీవుడ్‌ బ్యూటీ పెళ్లి చేసుకోబోతున్నదా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న హీరోయిన్లలో రెజీనా కసాండ్ర ఒకరు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న హీరోయిన్లలో రెజీనా కసాండ్ర ఒకరు. ప్రస్తుతం రెండు, మూడు తెలుగు సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు తాజాగా అభిమానులకు షాకిచ్చినంత పనిచేశారు. ఇటీవల ట్విట్టర్‌లో వెడ్డింగ్‌ బెల్స్.. మీ ఆశీస్సులు అందించండి అంటూ రెజినా ఓ ఫొటో పెట్టింది. అంతే రెజినా పెళ్లి చేసుకోబోతున్నాదేమోనని ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు అనుకున్నారు. ఇది సినిమా ప్రమోషనా.. తన పెళ్లి గురించి ఇలా అధికారికంగా సంకేతాలు ఇస్తున్నదా తెలియక తికమక పడ్డారు. టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ సైతం ఇలా తికమకపడి.. కంగ్రాట్స్‌ మచ్చి.. పార్టీ టైమ్‌ అంటూ ట్వీట్‌ చేశాడు.

దీంతో రెజినీ పెళ్లికి రెడీ అయిందని టాలీవుడ్‌లో ఊహాగానాలు షికారు చేశాయి. ఇలా ఎవరికివారు అనుకుంటూ ఊహాల్లో తేలిపోతుండగా చల్లగా రెజీనా అసలు కబురు చెప్పింది. ఈ భామ తాజాగా తమిళ చిత్రం ‘జెమినీ గణేషన్‌ సూరులి రాజనమ్‌’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన ఫొటోను ఈ అమ్మడు ట్విట్టర్‌లో పెట్టింది. అయితే, సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె చేసిన ఈ ట్వీట్‌ నెటిజన్లను తికమకపెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement