నాకు సిగ్గులేదు, నగ్నంగా నటిస్తా! | hero comments on nudity | Sakshi
Sakshi News home page

నాకు సిగ్గులేదు, నగ్నంగా నటిస్తా!

Nov 16 2016 4:54 PM | Updated on Sep 4 2017 8:15 PM

నాకు సిగ్గులేదు, నగ్నంగా నటిస్తా!

నాకు సిగ్గులేదు, నగ్నంగా నటిస్తా!

నా శరీరం నాకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఆ విషయంలో ఎలాంటి సిగ్గుపడను.

‘నా శరీరం నాకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఆ విషయంలో ఎలాంటి సిగ్గుపడను. నిజానికి చెప్పాలంటే శారీరకంగా నగ్నంగా నటించడం నాకేం పెద్ద విషయం కాదు. ఒక నటుడిగా మీకు అత్యంత సన్నిహితం కావడానికి నేను ప్రయత్నిస్తాను. నా ఆత్మను మీముందు స్వచ్ఛంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా నగ్నత్వం ఏముంటుంది. దానితో పోల్చుకుంటే భౌతిక నగ్వత్వం అనేది ఎంత?’ అంటూ తన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టాడు బాలీవుడ్‌ బాజీరావు రణ్‌వీర్‌సింగ్‌.

హిందీ చిత్ర పరిశ్రమలో అనతికాలంలోనే హీరోగా తనదైన ముద్రవేసిన రణ్‌వీర్‌సింగ్‌ తాజాగా ‘బేఫిక్రే’ సినిమాతో ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. ఈ సినిమాలో తను అండర్‌వేర్‌లో నటించడంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా తెలిపాడు. ఈ సినిమాలో రణ్‌వీర్‌ అండర్‌వేర్‌ సీన్‌పై ఇటీవల షారుఖ్‌ కూడా ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో స్పందించాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement