ఉగ్రకాండ: కశ్మీర్‌లో భీకర కాల్పులు.. | heavy encounter in srinagar | Sakshi
Sakshi News home page

ఉగ్రకాండ: కశ్మీర్‌లో భీకర కాల్పులు..

May 27 2017 8:33 AM | Updated on Sep 5 2017 12:09 PM

ఉగ్రకాండ: కశ్మీర్‌లో భీకర కాల్పులు..

ఉగ్రకాండ: కశ్మీర్‌లో భీకర కాల్పులు..

జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌ కాల్పులతో దద్దరిల్లింది.

శ్రీనగర్‌: గత కొన్నాళ్లుగా ఆందోళనలతో అట్టుడుకుతున్న జమ్మూకశ్మీర్‌ శనివారం ఉదయం కాల్పులతో దద్దరిల్లింది. సైము ట్రాల్‌ సెక్టార్‌లో శనివారం ఉదయం ఉగ్రవాదులు మాటువేయడంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. దీంతో ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇక్కడ ఇద్దరు ఉగ్రవాదులు పొంచి ఉన్నట్టు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.

ఇక, రాంపూర్‌ సెక్టార్‌లో చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించగా.. వారి ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక్కడ మరికొందరు ఉగ్రవాదులు నక్కినట్టు భావిస్తున్న భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. తాజా ఎదురుకాల్పులతో ఇక్కడ ఉద్రికత్త వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement