ఆరోగ్యాన్ని కనిపెట్టే హెడ్‌సెట్ | headset will find health conditions | Sakshi
Sakshi News home page

ఆరోగ్యాన్ని కనిపెట్టే హెడ్‌సెట్

Oct 21 2013 4:10 AM | Updated on Nov 6 2018 5:26 PM

హాయిగా పాటలు వింటూ వ్యాయామం చేస్తున్నారా? ఆ వ్యాయామం మీ శరీరానికి ఎంతవరకూ ఉపయోగపడిందో తెలుసుకోవాలనుకుంటున్నారా?

 వాషింగ్టన్: హాయిగా పాటలు వింటూ వ్యాయామం చేస్తున్నారా? ఆ వ్యాయామం మీ శరీరానికి ఎంతవరకూ ఉపయోగపడిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎన్ని కేలరీల శక్తి ఖర్చయిందో గుర్తించగలిగితే బాగుంటుంది అనుకుంటున్నారా? అయితే, వెంటనే ఐరివర్ సంస్థ తయారు చేసిన హెడ్‌సెట్‌ను కొనుక్కోండి.

ఇది మీ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని, పాటలూ వినొచ్చు.. అలాగే, గుండెకొట్టుకునే వేగం, రక్తపోటు తెలుసుకోవచ్చు. నడుస్తూనో, జాగింగ్ చేస్తూనో మీరు ప్రయాణించిన దూరం, వ్యాయామంతో శరీరంలో ఖర్చయిన కేలరీలను కూడా ఈ హెడ్‌సెట్‌తో తెలుసుకోవచ్చు. ఈ వివరాలన్నింటినీ హెడ్‌సెట్‌ను అనుసంధానించిన స్మార్ట్‌ఫోన్‌లో చూసుకోవచ్చు. ఇందులో ఇన్‌ఫ్రారెడ్ లైట్, యాక్సిలరోమీటర్లను అమర్చామని, దీనిద్వారా ఈసీజీతో తీసినంత కచ్చితత్వంతో ఫలితాలు వస్తాయని ఐరివర్ సంస్థ ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement