హర్దిక్ పటేల్పై దోపిడి కేసు | Hardik Patel booked for dacoity now | Sakshi
Sakshi News home page

హర్దిక్ పటేల్పై దోపిడి కేసు

Oct 21 2015 12:21 PM | Updated on Sep 3 2017 11:18 AM

హర్దిక్ పటేల్పై దోపిడి కేసు

హర్దిక్ పటేల్పై దోపిడి కేసు

పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హర్దిక్ పటేల్పై మరో కొత్త కేసు నమోదు అయింది.

సూరత్/ పలన్పూర్ : పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హర్దిక్ పటేల్పై మరో కొత్త కేసు నమోదు అయింది. ఇప్పటికే దేశ ద్రోహం కేసు నమోదైన అతడిపై తాజాగా దోపిడి కేసు నమోదు అయింది. ఈ ఏడాది జూలై 23వ తేదీన విస్నగర్ పట్టణంలో హర్దిక్ సారథ్యంలో ర్యాలీ జరిగింది.  ఈ సందర్భంగా ర్యాలీలో హింసతోపాటు విధ్వంసం చోటు చేసుకుంది. ఈ ఘటనకు హర్దిక్ కు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో హర్దిక్పై పోలీసులు దోపిడి కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే రిజర్వేషన్ల కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని... అవసరమైతే పోలీసులను చంపండంటూ అక్టోబర్ 3వ తేదీన సూరత్లో పటేల్ యువకులకు హర్దిక్ సూచించారు. దీంతో పోలీసులు హర్దిక్పై దేశద్రోహం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మెహసానా జిల్లాలో కూడా హర్దిక్ పై పలు కేసులు నమోదయ్యాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement