యాంటీ డెకాయిట్‌ ఆపరేషన్‌.. దొంగలకు చుక్కలు చూపించిన పోలీసులు | Anti Dacoity Operations In Hyderabad | Sakshi
Sakshi News home page

యాంటీ డెకాయిట్‌ ఆపరేషన్‌.. దొంగలకు చుక్కలు చూపించిన పోలీసులు

Jun 22 2024 7:10 PM | Updated on Jun 22 2024 7:27 PM

Anti Dacoity Operations In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌ : యాంటీ డెకాయిట్‌ ఆపరేషన్‌లో దొంగలకు హైదరాబాద్‌ పోలీసులు చుక్కలు చూపించారు. ధార్ భావరియా గ్యాంగ్‌లే లక్ష్యంగా నగరంలో పలు పప్రాంతాల్ని పోలీసులు జల్లెడ పట్టారు. ఈ సోదాల్లో రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిపై పోలీసులు కన్నేశారు. పలు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ తరుణంలో హైదరాబాద్‌ అసిఫ్‌ నగర్‌, చిలకలగూడా, సికింద్రాబాద్‌లో చైన్‌ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరిగింది. అయితే ఈ సమయంలో కళ్లుగప్పి దొంగలు పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసుల ఫైరింగ్‌ చేశారు. ఇక యాంటీ డెకాయిట్‌ ఆపరేషన్‌లో పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురు చైనా స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement