- ప్రజాభిప్రాయంపై సీఎంకు నివేదికలు
- కొత్తగా వరంగల్ రూరల్ జిల్లా
- కాకతీయ లేదా భద్రకాళి పేరు పెట్టే యోచన
- అధికారులతో కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష
- జిల్లాలపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు
- ఇప్పటికే 30 వేలు దాటిన వైనం
సాక్షి,హైదరాబాద్: కొత్త జిల్లాల ముసాయిదాపై వెల్లువెత్తుతున్న ప్రజాభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటోంది. వరంగల్ జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలపై పునరాలోచనలో పడింది. వరంగల్ సిటీ కేంద్రంగా ఉన్న వరంగల్, హన్మకొండలను రెండు జిల్లాలుగా విభజించడంపై అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత పెల్లుబికింది. వరంగల్, హన్మకొండ, ఖాజీపేట నగరాలు మూడూ ఒకే జిల్లాలో ఉండాలనే అభిప్రాయాలకు ఎక్కువ మంది మొగ్గుచూపారు. ఇంటెలిజెన్స్‌తో పాటు వివిధ వర్గాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మతో పాటు ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రధానంగా వరంగల్ జిల్లా అంశమే చర్చకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హన్మకొండకు బదులు వరంగల్‌ను జిల్లాగా కొనసాగించాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సమక్షంలో సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు మినహాయిస్తే వరంగల్‌లో దాదాపు 30 మండలాలు, 23 లక్షలకుపైగా జనాభా ఉంటాయి. వైశాల్యమూ పెద్దగా ఉంటుందని, దాంతో చిన్న జిల్లాల దృ క్పథమే దెబ్బతింటుందని సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో 27 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించడం తెలిసిందే. సగటున ఒక జిల్లాలో 18 మండలాలు, 13.33 లక్షల జనాభా ఉంటాయి. కానీ వరంగల్ 30 మండలాలు, 23 లక్షల జనాభాతో రాష్ట్రంలోనే పెద్ద జిల్లాగా ఏర్పడుతుంది. తద్వారా పాలనా సౌలభ్యానికి చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తున్న స్ఫూర్తి దెబ్బ తింటుందనే చర్చ జరిగినట్లు సమాచారం.
తెరపైకి ‘వరంగల్ రూరల్’
వరంగల్ నగరాన్ని విడదీయకుండా ఉండేందుకు వరంగల్ రూరల్ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అందుకు అనుగుణంగా మార్పుచేర్పుల కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతిపాదిత హన్మకొండ జిల్లాను రద్దు చేసి, అందులో ప్రతిపాదించిన మండలాలన్నిటినీ వరంగల్ జిల్లాలో కలుపుతారు. దాంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు ప్రస్తుతం హన్మకొండ జిల్లాగా ప్రతిపాదించిన మండలాలన్నీ కొత్త వరంగల్ జిల్లాలోనే ఉంటాయి. వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం మినహా వరంగల్‌లో ప్రతిపాదించిన ఇతర మండలాలతో కొత్తగా వరంగల్ రూరల్ జిల్లా ఏర్పడుతుంది. ఇలా రెండు జిల్లాలు చేస్తే వరంగల్ సిటీ మొత్తం ఒకే జిల్లాలో ఉంటుందని, చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తున్న ప్రయోజనమూ నెరవేరుతుందని సీఎం పేర్కొన్నట్టు తెలిసింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. కొత్తగా ఏర్పడే వరంగల్ రూరల్ జిల్లాకు కాకతీయ జిల్లా, లేదా భద్రకాళి జిల్లా అని పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
30 వేలు దాటిన అభ్యంతరాలు
జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన పన్నెండు రోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ద్వారా 29,411 మంది ఆన్లైన్లో తమ విజ్ఞప్తులను నమోదు చేశారు. వీటికి తోడు జిల్లా కలెక్టరేట్లలో, సీసీఎల్ఏలో మరో రెండు వేలకు పైగా అర్జీలు అందినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ అర్జీల ప్రకారం అత్యధికంగా వనపర్తి జిల్లా ఏర్పాటుపై 7,738, యాదాద్రి జిల్లాపై 4,386 విజ్ఞప్తులు అందాయి. కొత్త డివిజన్లకు సంబంధించి అత్యధికంగా జగిత్యాల జిల్లాపై 5,168 ఫిర్యాదులు నమోదయ్యాయి. కోరుట్లను రెవిన్యూ డివిజన్ కేంద్రం చేయాలని అత్యధికంగా విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.
కొత్త ప్రతిపాదనల స్వరూపం
వరంగల్ జిల్లా (21 మండలాలు): వరంగల్ కార్పొరేషన్, హన్మకొండ, ఖిలా వరంగల్, హసన్‌పర్తి, ఖాజీపేట, ధర్మసాగర్, చిల్పూర్, వేలేరు, స్టేషన్ ఘన్పూర్, రాయపర్తి, జఫర్‌గఢ్, నర్మెట్ట, రఘునాథపల్లి, పాలకుర్తి, కొడకండ్ల, ఇల్లంతకుంట, హుజూరాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, జమ్మికుంట
వరంగల్ రూరల్ జిల్లా (14 మండలాలు) : ఐనవోలు, వర్ధన్నపేట, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం, పర్వతగిరి, నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపూర్, దుగ్గొండి, నల్లబెల్లి, శాయంపేట, పరకాల
హన్మకొండ జిల్లా రద్దు!
Published Mon, Sep 5 2016 1:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement