ఆధునిక బానిసత్వం అంటే ఏంటో తెలుసా? | Half of India is susceptible to modern slavery and it’s time we did something about it | Sakshi
Sakshi News home page

ఆధునిక బానిసత్వం అంటే ఏంటో తెలుసా?

May 17 2017 5:00 PM | Updated on Sep 5 2017 11:22 AM

ఆధునిక బానిసత్వం అంటే ఏంటో తెలుసా?

ఆధునిక బానిసత్వం అంటే ఏంటో తెలుసా?

భారత దేశంలో సగానికి సగం జనాభా ‘మోడ్రన్‌ స్లేవరి లేదా ఆధునిక బానిసత్వం’లో నివసిస్తున్నారట.

న్యూఢిల్లీ: స్లేవరీ అంటే బానిసత్వం. ఈ పదం వినగానే ఉత్తర అమెరికాలో నల్లజాతీయులు అనుభవించిన బానిసత్వం బతుకు గుర్తొచ్చి ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ స్థాయిలో కాకపోయినా భారత్‌లో ఇప్పటికీ 1.80 కోట్ల మంది బానిసలుగా బతుకుతున్నారని ఆస్ట్రేలియాకు చెందిన ‘వాక్‌ ఫ్రీ ఫౌండేషన్‌’ సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోని 167 దేశాల్లో దాదాపు నాలుగున్నర కోట్ల మంది ప్రజలు బానిసలుగా జీవిస్తుంటే ఒక్క భారత్‌లోనే అత్యధికంగా 1.80 లక్షల మంది బానిసలుగా బతుకుతున్నారని ఫౌండేషన్‌ తెలిపింది.

అంతేకాకుండా భారత దేశంలో సగానికి సగం జనాభా ‘మోడ్రన్‌ స్లేవరి లేదా ఆధునిక బానిసత్వం’ (వెట్టి చాకిరి)లో నివసిస్తున్నారట. ఇక్కడ వెట్టిచాకిరంటే శారీరకంగా, మానసికంగా ఎలాంటి స్వేచ్ఛ లేకుండా యజమానుల బెదిరింపులకు భయపడి గొడ్డు చాకిరి చేస్తూ బతకడమని గ్లోబల్‌ స్లేవరి ఇండెక్స్‌ నిర్వచిస్తోంది. ఇటుక బట్టీల్లో, గనుల్లో వెట్టి చాకిరి చేయడం, బలవంతంగా వ్యభిచార వృత్తిలో కొనసాగడం, ఈ రెండు వృత్తుల్లో పనిచేసే వారు ఎక్కువగా చిన్నప్పుడే కిడ్నాపై రావడం ద్వారా జరుగుతుంది. బలవంతంగా బిచ్చమెత్తించడం కూడా బానిసత్వమే.

ప్రభుత్వేతర సాయుధ దళాల్లో బలవంతంగా చేర్చుకోవడం, భవన నిర్మాణం, పరిశ్రమలు, వ్యవసాయం, మత్స్యపరిశ్రమలోకి బాండెడ్‌ లేబర్‌గా పిల్లలతో పనిచేయడం కూడా ఆధునిక బనిసత్వమే. ఈ అన్ని రకాల ఆధునిక బానిసత్వం భారత్‌లో కొనసాగుతోంది. ఇంట్లో బట్టలుతికి, గిన్నెలు కడిగే పని మనుషులు కూడా ఈ ఆధునిక బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. అయితే ఇంకా దాన్ని ఈ కేటగిరీలో చేర్చలేదు.  వారు కూడా లైంగిక దోపిడీకి, బెదిరింపులకు గురవుతున్న సందర్భాలు కూడా ఉండడం వల్ల వారిని కూడా ఈ కేటగిరీలో చేర్చాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement