పనికి ప్రతిఫలం రూ. 600 కోట్లు | Gujarat Congress worker gives Rs 600 cr property to domestic help | Sakshi
Sakshi News home page

పనికి ప్రతిఫలం రూ. 600 కోట్లు

Jan 16 2014 2:00 AM | Updated on Aug 21 2018 2:48 PM

పనికి ప్రతిఫలం రూ. 600 కోట్లు - Sakshi

పనికి ప్రతిఫలం రూ. 600 కోట్లు

చిత్రంలోని ముసలాయన పేరు వినూభాయ్. మొన్నటివరకూ వినూభాయ్ ఓ పనిమనిషి. మరి నేడు రూ.600 కోట్లకు అధిపతి!

చిత్రంలోని ముసలాయన పేరు వినూభాయ్. మొన్నటివరకూ వినూభాయ్ ఓ పనిమనిషి. మరి నేడు రూ.600 కోట్లకు అధిపతి! అదెలా అంటే..  40 ఏళ్లుగా వినూభాయ్ తనకు చేసిన సేవకు మెచ్చి.. అతడి యజమాని బహుమతి కింద  తన యావదాస్తి ఇచ్చేశాడు!! నిజమే.. గజరాజ్ సింగ్ జడేజా. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో బడా వ్యాపారవేత్త, కాంగ్రెస్ నేత(ఫొటోలోని వ్యక్తి).
 
 గతేడాది సెప్టెంబర్ 21న మరణించారు. మూడు నెలల తర్వాత ఆయన వీలునామా కుటుంబ సభ్యుల చేతికి వచ్చింది. చదివితే షాక్.. ఆస్తి అంతా వినూభాయ్‌కు రాసేశారు. వారికి మండింది. వినూభాయ్‌ను కిడ్నాప్ చేశారు. పోలీసులు సరైన సమయంలో స్పందించి, వినూభాయ్‌ను విడిపించారు. కట్ చేస్తే.. వినూభాయ్ తాను పని చేసిన ఇంట్లోనే.. రాజాలా.. కాలుమీద కాలు వేసుకుని..  దర్జాగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement