మనిషికి సమీప బంధువు..
మనకి బంధువులు ఉంటారు కదా! అమ్మ తరఫు నుంచీ... నాన్న తరఫు నుంచి ఎంతోమంది చుట్టాలు ఉంటారు.
	మనకి బంధువులు ఉంటారు కదా! అమ్మ తరఫు నుంచీ... నాన్న తరఫు నుంచి ఎంతోమంది చుట్టాలు ఉంటారు. అయితే, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ఈ రకమైన బంధుత్వం గురించి కాదు! జంతువులతో మనిషికి ఉన్న చుట్టరికం గురించి. డి.ఎన్.ఎ. పరంగా చూసుకుంటే... మనిషికి అతి సమీప బంధు జంతువు గొరిల్లా.
	
	అవును, దీని డి.ఎన్.ఎ. మనిషి  డి.ఎన్.ఎ.కి దాదాపు 98 శాతం దగ్గరగా ఉంటుంది. అందుకే, గొరిల్లాలు చాలా తెలివైన జంతువులు. ఎంత తెలివైనవి అంటే... జంతు ప్రదర్శన శాలల్లో ఉండే సైన్ బోర్డులను సైతం ఇవి అర్థం చేసుకుని మసలుకోగలవు!
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
