ఆ గణపతికి కోట్లలో బీమా కవరేజ్ | Ganesha mandal buys insurance cover of Rs 300 crore | Sakshi
Sakshi News home page

ఆ గణపతికి కోట్లలో బీమా కవరేజ్

Sep 3 2016 8:57 AM | Updated on Sep 4 2017 12:09 PM

ఈ ఏడాది కూడా భారీ గణపతిని ప్రతిష్టిస్తున్న జీఎస్బీ సేవా మండల్ ... ఏకంగా రూ.300 కోట్లకు ఆ విగ్రహానికి ఇన్సూరెన్స్ చేపించింది.

ముంబై : వినాయక చవితి.. వీధికో వినాయకుడితో ఊరంతా ఉత్సాహంగా జరుపుకునే పండుగలలో ఇదీ ఒకటి.  వినాయక చవితికి ఇంకా రెండు రోజులే సమయం మిగిలి ఉండటంతో దేశంలో పండుగ వాతావరణం నెలకొంది. అప్పుడే మండపాలు ఏర్పాటు, అలంకరణ పనులు ప్రారంభిచేశారు. ఎప్పటిలాగే ముంబాయిలో భారీ గణపతి విగ్రహాలను ప్రతిష్టిస్తున్న సేవా మండల్లు భారీగా బీమా కవరేజ్లు పెంచేశాయట. ఈ ఏడాది రికార్డు స్థాయిలో బీమా కవరేజ్లు పెరిగాయట. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా భారీ గణపతిని ప్రతిష్టిస్తున్న జీఎస్బీ సేవా మండల్ ... ఏకంగా రూ.300 కోట్లకు ఆ విగ్రహానికి ఇన్సూరెన్స్ చేపించింది. ఈ బీమా మొత్తం గతేడాది కంటే రూ.2 కోట్లు ఎక్కువగా ఉంది. భారీ ఎత్తున్న వెండి గణపతికి కానుకగా వస్తుండటంతో బీమా కవరేజ్ను పెంచినట్టు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు.  తమ గణపతిని 68 కేజీల బంగారం, 315 కేజీల వెండితో ముస్తాబు చేశామని, గతేడాది 298 కేజీల వెండి కంటే ఈ ఏడాది 17 కేజీల ఎక్కువ వెండితో అలంకరించామని మాజీ అధ్యక్షుడు ఆర్జీ భట్ తెలిపారు.  
 
కానుకలు సమర్పిస్తున్న వారందరీ కోరికలను దేవుడి తీర్చాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. దేవత కోసం అందమైన మండపాన్ని కూడా తయారుచేస్తున్నట్టు చెప్పారు. రూ.300 కోట్ల బీమా కవరేజ్లో రూ.25 కోట్లు ఆభరణాలకు, రూ.10 కోట్లు అగ్నిప్రమాదం, భూకంపాలకు, రూ.40 కోట్లు ప్రజా బాధ్యత రక్షణకు, మిగిలిన రూ.225 కోట్లు భక్తులు, అధికారులు, స్వచ్ఛంద సేవకుల రక్షణగా చేపించారు.  ప్రభుత్వ రంగ బీమా కంపెనీ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ దీనికి బీమా అందిస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ముంబాయిలోని మరో ప్రముఖ గణేశుడు లాల్ బగ్చా రాజాకు రూ.51 కోట్లు,  ముంబాయి కా రాజా గణేశుడికి రూ.5.53 కోట్లు ఇన్సూరెన్స్ చేపించారు. దొంగతనం, ఉగ్రవాద ముప్పు, అగ్నిప్రమాదాలు వంటి కారణాలతో మండల్లు ఇన్సూరెన్స్ కవరేజ్కు కంపెనీలను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement