ఆఫీసుల్లోనూ నోట్7 నిషేధం!! | Galaxy Note 7 banned in office | Sakshi
Sakshi News home page

ఆఫీసుల్లోనూ నోట్7 నిషేధం!!

Oct 1 2016 10:40 AM | Updated on Sep 4 2017 3:48 PM

ఆఫీసుల్లోనూ నోట్7 నిషేధం!!

ఆఫీసుల్లోనూ నోట్7 నిషేధం!!

శాంసంగ్ కంపెనీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.

శాంసంగ్ కంపెనీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. విమానాల్లోనే కాదు.. ఇప్పుడు కార్యాలయాల్లోనూ శాంసంగ్ మొబైల్స్ వాడొద్దని నిబంధనలు పెడుతున్నారు. తాజాగా చైనాలో చెంగ్డూలోని  సిచువాన్ ప్రావిన్స్లో గల ఓ ప్రభుత్వ కార్యాలయంలో శాంసంగ్ గెలాక్సీ నోట్7 స్మార్ట్ఫోన్లపై నిషేధం విధించారు.. చెంగ్డూలోని ప్రభుత్వ వ్యవహారాల సర్వీసు సెంటర్ ఉద్యోగులు గెలాక్సీ ఫోన్లను వాడొద్దని పేర్కొంటూ తన మైక్రో బ్లాక్ అకౌంట్లో ఓ నోటీసును పోస్టు చేసింది. భద్రతా కారణాల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. ఒకవేళ ఎవరైనా బయటవ్యక్తులు ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఫోన్లను రీఛార్జ్ పెడుతున్నట్టు గమనించినా.. వారికి నచ్చజెప్పి కార్యాలయంలో రీఛార్జ్ చేయకుండా చూడాలని నోటీసులో తెలిపింది.
 
అయితే సందర్శకులను టార్గెట్ చేసుకునే ఈ సర్వీసు సెంటర్ గెలాక్సీ నోట్7 ఫోన్లపై రద్దును చేపడుతుందని పలు మీడియా సంస్థలు రిపోర్టు చేయడంతో, కేవలం ఈ పాలసీ ఉద్యోగులకు మాత్రమేనని వర్తింపజేస్తామని సందర్శకులకు కాదని తెలిపింది. ఇప్పటికే పలు దేశాల విమానయాన సంస్థలతో పాటు చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా గెలాక్సీ నోట్7 ఫోన్లపై నిషేధం విధించింది. దేశీయ విమాన ప్రయాణాల్లో ఈ ఫోన్లను వాడటం కాని, రీఛార్జ్ కాని చేయకూడదని ఆదేశాలు జారీచేసింది. చైనాలో ఐదుగురు గెలాక్సీ నోట్7 యూజర్లు తమ ఫోన్లు పేలిపోయాయని ఫిర్యాదు చేశారు. అయితే ఈ పేలుడుకు సంబంధించి ఇంకా సరియైన కారణాలు వెల్లడికాలేదు. మరోవైపు బ్యాటరీ పేలుళ్ల సమస్యతో గెలాక్సీ నోట్7 ఫోన్లను శాంసంగ్ రీకాల్ చేపడుతున్న సంగతి తెలిసిందే.  

Advertisement
 
Advertisement
Advertisement