పశ్చిమగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరి పుష్కరాల అన్నదాన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరి పుష్కరాల అన్నదాన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రతి రోజూ లక్ష మందికి అన్నదానం చేయనున్నారు.
శనివారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు కొవ్వూరులో పుష్కరఘాట్ పనులను పరిశీలించారు. గోసంరక్షణశాలను చంద్రబాబు సందర్శించారు.