శక్తిమిల్స్ గ్యాంగ్ రేప్: నలుగురికి జీవితఖైదు


దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోని శక్తిమిల్స్ ప్రాంగణంలో 19 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులకు కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. ఈ సంఘటన 2013 జూలై 31న జరిగింది. దోషులు సహజంగా మరణించేవరకు ఈ శిక్ష అమలవుతుంది. దోషులు విజయ్ జాదవ్ (18), ఖాసిం హఫీజ్ షేక్ అలియాస్ ఖాసిం బెంగాలీ (20), సలీం అన్సారీ (27), మహ్మద్ ఆష్ఫక్ షేక్ (26)లతో పాటు మరో మైనర్ కూడా ఈ కేసులో ఉన్నాడు.



బాధితురాలు సిద్దివినాయకుని గుడికి తన స్నేహితుడితో కలిసి వెళ్తూ, దగ్గర దారి అవుతుందని శక్తి మిల్స్ మీదుగా వెళ్తుండగా ఈ ఐదుగురు ఆమెపై దాడిచేశారు. మొదట్లో ధైర్యం లేక పోలీసులకు చెప్పకపోయినా.. తర్వాత ఆగస్టు 22న అక్కడే మరో జర్నలిస్టుపై కూడా అలాగే జరగడంతో తర్వాత బయటపెట్టింది. ఈ రెండు కేసుల్లోనూ జాదవ్, బెంగాలీ, అన్సారీ దోషులని ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి షాలినీ ఫన్సాల్కర్ జోషి తీర్పునిచ్చారు. ఈ రెండు కేసుల్లో వేర్వేరుగా దోషులైన ఇద్దరు మైనర్లను ముంబై బాల నేరస్థుల బోర్డు ప్రత్యేకంగా విచారిస్తుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top