
ఎమిరేట్స్ విమానం(ఫైల్)
దుబాయ్-బోస్టన్ విమానానికి ప్రమాదం తప్పింది. ఇంజిన్ నుంచి వ్యాపించిన మంటలను వెంటనే అదుపు చేయడంతో ముప్పు తప్పింది.
బోస్టన్: దుబాయ్-బోస్టన్ విమానానికి ప్రమాదం తప్పింది. ఇంజిన్ నుంచి వ్యాపించిన మంటలను వెంటనే అదుపు చేయడంతో ముప్పు తప్పింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలు దేరిన ఎమిరేట్స్ బోయింగ్ 777-300 విమానం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో లండన్ లో దిగింది.
విమానం కిందకు దిగేసమయంలో ఇంజిన్ నుంచి స్వల్పంగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన విమానాశ్రయ సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 349 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. వీరంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు.