చర్చి కుప్పకూలి.. ఐదుగురి మృతి | Five killed after church collapses in Nigeria | Sakshi
Sakshi News home page

చర్చి కుప్పకూలి.. ఐదుగురి మృతి

Apr 13 2015 8:19 AM | Updated on Apr 4 2019 5:24 PM

ఆగ్నేయ నైజీరియాలోని ఎనుగు రాష్ట్రంలో చర్చి భవనం కుప్పకూలి.. ఐదుగురు మరణించారు.

ఆగ్నేయ నైజీరియాలోని ఎనుగు రాష్ట్రంలో చర్చి భవనం కుప్పకూలి.. ఐదుగురు మరణించారు. సెయింట్ ఆంథోనీ కాథలిక్ చర్చి భవనం ఒకటి వర్షాల కారణంగా కూలిపోయిందని ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన  ఇసాక్ ఎంబా అనే వ్యక్తి చెప్పారు. ఈ ప్రమాదం జరిగే సమయానికి భక్తులంతా ప్రార్థనలు చేస్తున్నారు.

దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోందని పోలీసులు అంటున్నారు. అయితే.. కేవలం వర్షాలు కురవడం వల్లే చర్చి కూలిందా, మరేదైనా కారణం ఉందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. భవనం ఎందుకు కూలిందన్న విషయం స్పష్టం కాలేదని పోలీసులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement