breaking news
church collapse
-
విషాదం : చర్చి కూలి 22 మంది మృతి
ఘనా : చర్చి కూలి 22 మంది మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం ఘనాలో చోటుచేసుకుంది. వివరాలు.. పశ్చిమ ఘనాలోని ఆరంతస్తుల భవనంలో చర్చిని నిర్వహిస్తున్నారు. అయితే చర్చి ఆకస్మాత్తుగా శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో చర్చిలో 60 మంది ప్రార్థన చేస్తున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న రెస్య్వూ సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకొని క్షతగాత్రులను బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. కాగా మట్టి శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీయడం కష్టంగా మారింది. కాగా ప్రమాదంలో 22 మంది మృతి చెందారని.. మిగతావారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని అధికారులు తెలిపారు. భవనం నాసిరకంగా ఉండడంతోనే ఇలాంటి ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నోటర్ డామ్‌కు రూ.7 వేల కోట్ల విరాళాలు
ప్యారిస్: అగ్నికి ఆహుతైన ప్యారిస్‌లోని ప్రఖ్యాత చర్చి నోటర్ డామ్ కెథడ్రల్ పునర్నిర్మాణ పనుల కోసం ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. ఈ చర్చి మరమ్మతులకు గానూ సుమారు రూ.7 వేల కోట్ల విరాళాలు వసూలయ్యాయి. అయితే ఈ కట్టడంపునర్నిర్మాణానికి గానూ ఐదేళ్లు పడుతుందంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రోన్ ప్రకటించారు. బుధవారం ఉదయం నిర్మాణ బృందాలు భారీ క్రేన్‌తో పాటు అవసరమైన చెక్క సామగ్రితో నోటర్ డామ్‌కు చేరుకున్నాయి. సోమవారం నోటర్ డామ్‌కు మంటలు అంటుకొని పైకప్పు పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో ప్రాణనష్టం జరగలేదు. -
చర్చి పైకప్పు కూలి 160 మంది మృతి
-
చర్చి పైకప్పు కూలి 160 మంది మృతి
ఉయో(నైజీరియా): మరికొద్ది రోజుల్లో క్రీస్మస్ పండుగ జరుపుకోనుండగా నైజీరియాలోని ఓ చర్చిలో పెను విషాదం చోటు చేసుకుంది. ఉయోలోని రిగ్‌నర్స్ బైబిల్ చర్చి పైకప్పు కూలి 160 మంది మృతిచెందారు. చర్చిలో జరిగిన ఓ మతకార్యక్రమానికి క్రైస్తవులు హాజరై ప్రార్థనలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆక్వా ఇబామ్ రాష్ట్ర గవర్నర్ ఉడోం ఇమ్మాన్యువల్ కూడా ఈ సంఘటన జరిగిన సమయంలో చర్చిలోనే ఉన్నారు. అయితే ఇమ్మాన్యువల్కు ఎలాంటి గాయాలు కాలేదని, ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారని అధికారులు వెల్లడించారు. ఈ సంఘనపై నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శకలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటి వరకు 60 మృతదేహాలను బయటకు తీసినట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ప్రమాద ఘటనపై ఉడోం ఇమ్మాన్యువల్ దర్యాప్తుకు ఆదేశించారు. చర్చి ఇంకా నిర్మాణ దశలోనే ఉండగా, క్రిస్మస్ సమీపిస్తుండగా వేగంగా పైకప్పు పనులను పూర్తి చేయడంతో ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. -
కూలిన నిర్మాణంలో ఉన్న చర్చిభవనం
-
చర్చి కుప్పకూలి.. ఐదుగురి మృతి
ఆగ్నేయ నైజీరియాలోని ఎనుగు రాష్ట్రంలో చర్చి భవనం కుప్పకూలి.. ఐదుగురు మరణించారు. సెయింట్ ఆంథోనీ కాథలిక్ చర్చి భవనం ఒకటి వర్షాల కారణంగా కూలిపోయిందని ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఇసాక్ ఎంబా అనే వ్యక్తి చెప్పారు. ఈ ప్రమాదం జరిగే సమయానికి భక్తులంతా ప్రార్థనలు చేస్తున్నారు. దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోందని పోలీసులు అంటున్నారు. అయితే.. కేవలం వర్షాలు కురవడం వల్లే చర్చి కూలిందా, మరేదైనా కారణం ఉందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. భవనం ఎందుకు కూలిందన్న విషయం స్పష్టం కాలేదని పోలీసులు అంటున్నారు.