విషాదం : చర్చి కూలి 22 మంది మృతి | Few Lost Life And Several Injured Church Collapses In Ghana | Sakshi
Sakshi News home page

విషాదం : చర్చి కూలి 22 మంది మృతి

Oct 24 2020 7:34 PM | Updated on Oct 24 2020 7:45 PM

Few Lost Life And Several Injured Church Collapses In Ghana - Sakshi

ఘనా : చర్చి కూలి 22 మంది మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం ఘనాలో చోటుచేసుకుంది. వివరాలు.. పశ్చిమ ఘనాలోని ఆరంతస్తుల భవనంలో చర్చిని నిర్వహిస్తున్నారు.  అయితే చర్చి ఆకస్మాత్తుగా శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలింది.  ఈ ప్రమాద సమయంలో చర్చిలో 60 మంది ప్రార్థన చేస్తున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న రెస్య్వూ సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకొని క్షతగాత్రులను బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. కాగా మట్టి శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీయడం కష్టంగా మారింది. కాగా ప్రమాదంలో 22 మంది మృతి చెందారని.. మిగతావారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని అధికారులు తెలిపారు. భవనం నాసిరకంగా ఉండడంతోనే ఇలాంటి ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement