చర్చి‌ పైకప్పు కూలి 160 మంది మృతి | Nigeria Uyo: 160 dies as church collapse | Sakshi
Sakshi News home page

చర్చి‌ పైకప్పు కూలి 160 మంది మృతి

Dec 11 2016 7:32 AM | Updated on Sep 4 2017 10:28 PM

చర్చి‌ పైకప్పు కూలి 160 మంది మృతి

చర్చి‌ పైకప్పు కూలి 160 మంది మృతి

మరికొద్ది రోజుల్లో క్రీస్మస్ పండుగ జరుపుకోనుండగా నైజీరియాలోని ఓ చర్చిలో పెను విషాదం చోటు చేసుకుంది.

ఉయో(నైజీరియా): మరికొద్ది రోజుల్లో క్రీస్మస్ పండుగ జరుపుకోనుండగా నైజీరియాలోని ఓ చర్చిలో పెను విషాదం చోటు చేసుకుంది. ఉయోలోని రిగ్‌నర్స్ బైబిల్ చర్చి పైకప్పు కూలి 160 మంది మృతిచెందారు. చర్చిలో జరిగిన ఓ మతకార్యక్రమానికి  క్రైస్తవులు హాజరై ప్రార్థనలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆక్వా ఇబామ్ రాష్ట్ర గవర్నర్ ఉడోం ఇమ్మాన్యువల్ కూడా ఈ సంఘటన జరిగిన సమయంలో చర్చిలోనే ఉన్నారు.

అయితే ఇమ్మాన్యువల్కు ఎలాంటి గాయాలు కాలేదని, ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారని అధికారులు వెల్లడించారు. ఈ సంఘనపై  నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శకలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటి వరకు 60 మృతదేహాలను బయటకు తీసినట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ప్రమాద ఘటనపై ఉడోం ఇమ్మాన్యువల్ దర్యాప్తుకు ఆదేశించారు. చర్చి ఇంకా నిర్మాణ దశలోనే ఉండగా, క్రిస్మస్ సమీపిస్తుండగా వేగంగా పైకప్పు పనులను పూర్తి చేయడంతో ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement