బకాయిల కోసం చెరుకు రైతుల నిరసన | farmers protest at gowada sugar factory mahajana sabha | Sakshi
Sakshi News home page

బకాయిల కోసం చెరుకు రైతుల నిరసన

Sep 30 2015 4:24 PM | Updated on Jun 4 2019 5:04 PM

విశాఖపట్నం జిల్లాలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మహాజన సభ గందరగోళంగా సాగింది.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మహాజన సభలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ మల్లునాయుడు ప్రసంగిస్తుండగా బకాయిలు చెల్లించాలని రైతులు నిలదీశారు. రైతులు కుర్చీలను పడేసి నిరసన తెలియజేశారు.

ఈ సందర్భంగా రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. రైతులు సభ జరగనివ్వకుండా వేదికపై రాళ్లు, కుర్చీలు విసిరేశారు. వేదిక వద్ద ఉన్న పోలీసులకు, జర్నలిస్టులకు గాయాలయ్యాయి.  పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రైతులపై లాఠీచార్జ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement