విద్యార్థులు దాడిలో ప్రిన్సిపల్ మృతి | Engineering college principal hacked to death by students | Sakshi
Sakshi News home page

విద్యార్థులు దాడిలో ప్రిన్సిపల్ మృతి

Oct 10 2013 11:43 AM | Updated on Sep 1 2017 11:31 PM

ర్యాగింగ్ చేస్తూ జూనియర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో కాలేజీ హస్టల్ విడిచి వెళ్లాలని ఆదేశించిన ప్రిన్సిపల్పై ముగ్గురు విద్యార్థులు కక్ష కట్టి దాడి చేసి హత్య చేశారు.

ర్యాగింగ్ చేస్తూ జూనియర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో కాలేజీ హస్టల్ విడిచి వెళ్లాలని ఆదేశించిన ప్రిన్సిపల్పై ముగ్గురు విద్యార్థులు కక్ష కట్టి దాడి చేసి హత్య చేశారు. ఆ ఘటన ట్యూటికారన్ జిల్లా వలనాడులోని జీసెస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ సురేష్పై ముగ్గురు విద్యార్థులు కత్తులతో దాడి చేశారు. దాంతో కాలేజీ సిబ్బంది ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

 

ఆయన అప్పటికే మరణించారని వైద్యులు వెల్లడించారు. అయితే దాడి చేసిన విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు తెలపారు. ఇంజనీరింగ్ కాలేజ్ హస్టల్లో సహాచర విద్యార్థులతోపాటు జూనియర్లను వారు ర్యాగింగ్ చేస్తున్నారు. దాంతో ఆ ముగ్గురు విద్యార్థులపై కాలేజీ ప్రిన్సిపల్కు  ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో హస్టల్ ఖాళీ చేసి వెళ్లాలని వారిని ప్రిన్సిపల్ ఆదేశించారు. దాంతో విద్యార్థులు కక్ష కట్టి ప్రిన్సిపల్పై దాడి చేశారని పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని ట్యూటికారన్ జిల్లా ఎస్పీ   దొరయై సందర్శించారు. అనంతరం స్థానిక పోలీసు ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement