జిల్లాలోని గొట్లాం సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఘోర రైలుప్రమాదంలో తీవ్రగాయాలపాలైన క్షతగాత్రులకు రక్తం అవసరమవుతోంది.
విజయనగరం: జిల్లాలోని గొట్లాం సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఘోర రైలుప్రమాదంలో తీవ్రగాయాలపాలైన క్షతగాత్రులకు రక్తం అవసరమవుతోంది. రక్తందానం చేయాలనుకునేవారు స్వచ్చంధంగా ముందుకు రావాలంటూ సాక్షి విజ్క్షప్తి చేస్తోంది. రైలుప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను విజయనగరం, గొట్లాం సమీప ఆస్పత్రులకు తరలించినట్టు సమాచారం. విజయనగరం ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం లేనందున క్షతగాత్రులను వైజాగ్ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే రైల్వే ప్రమాదం ఘటనపై స్పందించిన ఆ జిల్లా కలెక్టర్ క్రాంతీలాల్ దండే ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. విజయనగరం అధికార యంత్రంగం కూడా కదలి సహాయక చర్యల్లో నిమగ్నమైనట్టు సమాచారం.