హైదరాబాద్లో అనేక సౌలభ్యాలు అందుబాటులో ఉన్నాయి, కానీ నగరంలో సామాన్యులు చదువుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమనీ తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి వ్యాఖ్యానించారు.
రాయదుర్గం (రంగారెడ్డి): హైదరాబాద్లో అనేక సౌలభ్యాలు అందుబాటులో ఉన్నాయి, కానీ నగరంలో సామాన్యులు చదువుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమనీ తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో క్రాస్‌విండ్స్, స్కేల్డ్ ఏజిల్ శిక్షణా కార్యక్రమాన్ని నాయిని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ బహుత్ అచ్చాహై... మగర్ ఎడ్యుకేషన్‌తో కాస్ట్‌లీ హై’... అన్నారు. లాన్‌లో కూర్చొని చదువుకుంటున్న ఐఎస్‌బీ విద్యార్థులను ఆయన పలకరించారు. ఐఎస్‌బీకి చెందిన అధికారులతో ఐఎస్‌బీలో నిర్వహించే కోర్సులు, శిక్షణ కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.