బాధిత కుటుంబానికి రూ.34 లక్షల పరిహారం | DTC to pay Rs 34 lakh to family of road mishap | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబానికి రూ.34 లక్షల పరిహారం

Dec 7 2013 8:49 PM | Updated on Sep 2 2017 1:22 AM

ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు ఢీకొట్టడంతో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి రూ.34 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డీటీ సీని మోటార్ యాక్సిడెంట్ క్లయిమ్స్ ట్రిబ్యునల్(ఎంఏసీటీ) ఆదేశించింది.

న్యూఢిల్లీ : ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు ఢీకొట్టడంతో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి రూ.34 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డీటీసీని మోటార్ యాక్సిడెంట్ క్లయిమ్స్ ట్రిబ్యునల్(ఎంఏసీటీ) ఆదేశించింది. 2011 అక్టోబర్ 14న హరిచరణ్ రామ్ అనే వ్యక్తి జహంగిర్‌పురికి నడుచుకుంటూ వస్తుండగా వెనుకగా వచ్చిన డీటీసీ బస్సు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. అదే ప్రమాదంలో గాయపడిన జగదీష్ అనే వ్యక్తి ఇచ్చిన సాక్ష్యంతో ఏకీభవించిన ట్రిబ్యునల్, బాధిత కుటుంబానికి రూ.34,13,656 నష్టపరిహారం చెల్లించాలని డీటీసీని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement