ఇక వాటర్ బాటిళ్లను కూడా తినొచ్చట! | Drink from this bottle, then eat it too! | Sakshi
Sakshi News home page

ఇక వాటర్ బాటిళ్లను కూడా తినొచ్చట!

Mar 30 2014 10:38 PM | Updated on Sep 2 2017 5:22 AM

ఇకపై తాగేసిన వాటర్ బాటిళ్లు చెత్తకుప్పల్లో... కూల్‌డ్రింక్ టిన్నులు రోడ్లపై పడేయాల్సిన అవసరం లేదు.

లండన్: ఇకపై తాగేసిన వాటర్ బాటిళ్లు చెత్తకుప్పల్లో... కూల్‌డ్రింక్ టిన్నులు రోడ్లపై పడేయాల్సిన అవసరం లేదు.   తినడానికి అనువుగా ఉన్న ‘ఓహో’ బాటిల్‌ను ఉపయోగిస్తే చాలు.తాగాల్సింది తాగేసి, బాటిల్‌ను కూడా లొట్టలేసుకుంటూ తినొచ్చు.. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా స్పెయిన్‌కు చెందిన పరిశోధకులు ఈ ‘తినే బాటిల్’ను రూపొందించారు. గోళాకారంలో కనిపించే దీన్ని ఉప్పు, గోధుమవర్ణం శిలీంధ్రానికి చెందిన జిగురుతో తయారు చేశారు. రెండు పొరలతో నిర్మితమైన ఈ బాటిల్‌కు ‘ఓహో’అని పేరు పెట్టారు.

 

ఇందులో ద్రవాలను నిల్వచేయవచ్చు. తాగిన తర్వాత కూల్‌గా బాటిల్‌ను కూడా తినొచ్చు. ‘ఓహో’ పర్యావరణహితమైందే కాకుండా ఎంతో సురక్షితమైంది, చవకైందని తయారీదారులు చెబుతన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement