ఆ పుకార్లను నమ్మొద్దు: మహేందర్ రెడ్డి | Don't believe any false rumors, says CP mahendar reddy | Sakshi
Sakshi News home page

'సోషల్ మీడియాలో వస్తున్నపుకార్లు నమ్మొద్దు'

Jun 30 2016 7:01 PM | Updated on Oct 22 2018 6:02 PM

ఆ పుకార్లను నమ్మొద్దు: మహేందర్ రెడ్డి - Sakshi

ఆ పుకార్లను నమ్మొద్దు: మహేందర్ రెడ్డి

పేలుళ్లపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి సూచించారు.

హైదరాబాద్ : పేలుళ్లపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి సూచించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ హైదరాబాద్లో ప్రజా భద్రతకు ముప్పు ఉన్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయని, అవన్నీ అవాస్తలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పుకార్లు వ్యాపింపచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

మరోవైపు అదుపులోకి తీసుకున్న  ఐసిస్ సానుభూతిపరుల నుంచి ఎన్ఐఏ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారు. సిరియా తీవ్రవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఆయుధాల కోసం హబీబ్, ఇబ్రహీం గత జూన్లో అజ్మీర్ వెళ్లినట్లు సమాచారం. రూ.60 వేలు నుంచి రూ.65 వేలు వరకూ ఖర్చు చేసిన ఆయుధాలు దొరకలేదని, ఇటీవలే నందన్ వెళ్లి రెండు ఆయుధాలు సేకరించినట్లు ఐసిస్ సానుభూతిపరులు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement