ట్రక్కు డ్రైవర్ గా మారిన ట్రంప్ | Donald Trump Has A Truck Driver Moment, Twitter Goes Into Overdrive | Sakshi
Sakshi News home page

ట్రక్కు డ్రైవర్ గా మారిన ట్రంప్

Mar 24 2017 11:27 AM | Updated on Aug 25 2018 7:52 PM

ట్రక్కు డ్రైవర్ గా మారిన ట్రంప్ - Sakshi

ట్రక్కు డ్రైవర్ గా మారిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రక్కు డ్రైవర్ అవతారం ఎత్తారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రక్కు డ్రైవర్ అవతారం ఎత్తారు. శ్వేతభవనం ముందు పార్క్ చేసిన ట్రక్కులోకి ఎక్కి సందడి చేశారు. అగ్రదేశాధ్యక్షుడు ట్రక్కు నడుపుతున్న ఫొటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో సరదా కామెంట్లు పోటెత్తాయి. గురువారం ట్రక్కు డ్రైవర్లు, ఆ రంగానికి చెందిన ప్రతినిధులతో ట్రంప్‌ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వైట్ హౌస్ ముందు పార్క్ చేసిన ట్రాక్టర్ ట్రైయిలర్ వాహనంలోకి ఎక్కిన ట్రంప్ కొద్ది నిమిషాల పాటు సందడి చేశారు. డ్రైవర్ సీటులో కూర్చుకుని ముందుగా హారన్ మోగించారు. స్టీరింగ్ పట్టుకుని తనదైన శైలిలో హావభావాలు పలికించారు.

‘ట్రక్కు డ్రైవర్లకు తెలిసినంతగా అమెరికా గురించి తెలియదు. రోజూ వారు కొండలు, లోయలు చూస్తారు. రోడ్లపై పూడ్చాల్సిన ప్రతి గొయ్యిను పరిశీలిస్తార’ని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ట్రక్కు డ్రైవర్ అవతారం ఎత్తిన ట్రంప్ ఫొటోలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడంతో ట్విటర్ లో నెటిజన్లు సరదా కామెంట్లు పెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement